: ఆకాశ హర్మ్యాల మధ్య కళ్లకు గంతలు కట్టుకుని తాడుపై నడిచాడు


వేలాది మంది వీక్షకుల సాక్షిగా 65 అంతస్తుల ఆకాశ హర్మ్యాల మధ్య నుంచి కింద పడితే శరీరం ఛిద్రమైపోయేంత (587 అడుగుల) ఎత్తులో, కళ్లకు గంతలు కట్టుకుని, సన్నని తాడుపై 454 అడుగుల దూరం నడిచి అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాడు 'డేర్ డెవిల్' నిక్ వాలెందా. అమెరికా వాసి నిక్ వాలెందాకు సాహస కృత్యాలు చేయడం నిత్యకృత్యం. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి తనకు తానే సాటి అనిపించుకుంటాడు. షికాగోలోని మెరినా సిటీ టవర్స్ నుంచి నది ఆవలి వైపునున్న మరో భవనం వరకు ఉన్న 454 అడుగుల దూరాన్ని సన్నని తాడుపై ఎలాంటి రక్షణ లేకుండా ఆరున్నర నిమిషాల్లో నడిచాడు. డిస్కవరీ ఛానెల్ ఈ సాహసాన్ని చిత్రీకరించింది. తరచూ సాహసాలు చేసే తాను ఈసారి ఒత్తిడికి లోనయ్యానని సాహసం పూర్తయ్యాక నిక్ పేర్కొన్నాడు. ఈ సాహసం కోసం తాను 15 డిగ్రీల కోణంలో ప్రాక్టీస్ చేయగా, తాడు 19 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేశారని, దానికి తోడు గాలి బలంగా వీయడంతో ఒత్తిడికి లోనయ్యానని పేర్కొన్నాడు. కాగా ఈ సాహసాన్ని చూసిన షికాగో ప్రజలు మాత్రం అద్భుతం చూశామంటూ సంబరపడుతున్నారు.

  • Loading...

More Telugu News