: సచిన్ కు అప్పుడు కోపం వచ్చింది!


బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కోపం వచ్చింది. మైదానంలో మిస్టర్ పర్ ఫెక్ట్ గా ఉండే సచిన్ కు కోపం తెప్పించింది మాత్రం మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ కావడం విశేషం. 2007లో జరిగిన వరల్డ్ కప్ ముందు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ఛాపెల్ రింగుమాస్టర్ లా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 6న విడుదల కానున్న తన జీవితచరిత్ర (ప్లేయింగ్ ఇట్ మై వే)లో సచిన్ మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ పై తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఛాపెల్ విభజించు- పాలించు పద్దతిని అమలు చేసి ఆటగాళ్ల మధ్య విభేదాలు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న తనను వరల్డ్ కప్ ముందు ఛాపెల్ ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. 2007, 08, 09 మధ్య ఛాపెల్ కోచ్ గా పని చేసిన సందర్భంలో గంగూలీ, సచిన్, ఇతర ఆటగాళ్ల మధ్య వివాదాలు రచ్చకెక్కిన సంగతి, ఆటగాళ్లు గ్రూపులుగా మారిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News