: పార్టీ వీడిన తరువాత అతడిని బహిష్కరించారు!
కాంగ్రెస్ అధిష్ఠానం తమిళనాడు శాఖ పట్ల అనుసరిస్తున్న తీరు బాగాలేదని, అధిష్ఠానం క్రియాశీలకంగా లేదని సీనియర్ నేత జీకే వాసన్ ఆరోపిస్తూ పార్టీని వీడడం తెలిసిందే. తన తండ్రి జీకే మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని మళ్లీ పునరుద్ధరిస్తానని జీకే వాసన్ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో జీకే వాసన్ ను కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, తమిళనాట కాంగ్రెస్ లో వాసన్ పెద్దనేత. చిదంబరం వైఖరి కారణంగానే ఆయన తప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన పార్టీని విడనాడటంతో తమిళనాట కాంగ్రెస్ పార్టీ కీలకనేతను కోల్పోయినట్టయింది.