: రూ.11 లక్షల నగదు లాక్కుని ఉడాయించారు!
బ్యాంకులో జమ చేసేందుకు రూ.11 లక్షలు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు తస్కరించిన సంఘటన వెలుగు చూసింది. అజంగఢ్ కు చెందిన రాజ్ కుమార్ ఓ కారు ఏజెన్సీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆఫీసు నుంచి రూ.11.82 లక్షల నగదు జమ చేసేందుకు బ్యాంకుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి అతని దగ్గర నగదు లాక్కుని ఉడాయించారు. దీంతో, రాజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.