: గంటా కారు ఢీ కొనడంతో దంపతులకు గాయాలు
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కారు ఢీకొనడంతో ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖజిల్లా యలమంచిలి మండలం సోమన్నపాలెంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని వెనుదిరగగా మార్గమధ్యంలో గంటా కారు, బైక్ పైన వెళ్తున్న శ్రీనివాసరావు (ఆర్ఎంపీ వైద్యుడు ), ఆయన భార్య లక్ష్మిలను ఢీ కొట్టింది. బైక్ పై నుంచి పడిపోవడంతో లక్ష్మి తలకి తీవ్రగాయం కావడంతో పాటు వాంతులయ్యాయి. వెంటనే వారిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత మెరుగైన వైద్యమందించేందుకు అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.