: టీఆర్ఎస్ లోకి ఐదుగురు టీ.టీడీపీ ఎమ్మెల్సీలు


తెలంగాణ టీడీపీకి చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బోడకంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, సలీంలు సమావేశమై చర్చించుకున్నారు. అనంతరం తాము టీఆర్ఎస్ లో విలీనమవుతున్నామంటూ రాష్ట్ర మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ రాశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వారు కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం మెజార్టీ సభ్యుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

  • Loading...

More Telugu News