: ఏమిరా బాబు! సమాచారమిచ్చారు...ఆహ్వానమేదీ?: వీహెచ్


టీసీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు, మరి ఆహ్వానమేదీ? అంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వలసలను కట్టడి చేసి, పార్టీని బలోపేతం చేయడంపై ప్రస్తుత, మాజీ ఎంపీలంతా ఈ నెల 9న ప్రత్యేకంగా సమావేశమవుతామని తెలిపారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతోంటే కేడర్ లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎల్పీ భేటీ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News