: వందకోట్ల క్లబ్బులో 'కత్తి' చిత్రం
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ చిత్రం 'కత్తి' వంద కోట్ల మార్కును దాటింది. 'తుపాకి', 'హాలిడే' (తుపాకి హిందీ రీమేక్) చిత్రాల తరువాత వంద కోట్ల క్లబ్బులో చేరిన ఈ దర్శకుడి మూడో సినిమా ఇది. ఈ క్రమంలో మురగదాస్ హ్యట్రిక్ సాధించాడు. ఈ మేరకు ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, "చాలా ప్రత్యేకమైన రోజు! #కత్తి చాలా ఫాస్ట్ గా రూ.100 కోట్ల మార్కును చేరింది ! మొత్తం కలెక్షన్- రూ.100.7 కోట్లు (రూ.65.1 ఏటీఎన్, రూ.20.2 ఓవర్సీస్ రూ.15.4 ఇతర రాష్ట్రాల నుంచి)" అని ట్వీట్ చేశాడు. హీరో విజయ్, సమంతా ఈ సినిమాలో జంటగా నటించారు.