: బీర్ కోసం... పబ్ ముందు విమానంతో వాలిన ఆస్ట్రేలియన్!


నిజమేనండి, బాబూ... ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి బీర్ కోసం ఏకంగా విమానంతోనే వచ్చేశాడు. అయితే అది తేలికపాటి విమానం కాబట్టి సరిపోయింది కాని, లేకపోతే పరిస్థితి ఏమిటి? పశ్చిమ ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఘటనతో పిల్బారా పట్టణ వాసులు హడలిపోయారు. విమానంతో వచ్చిన వ్యక్తి మాత్రం పబ్ ముందు తన విమానాన్ని పార్క్ చేసి నింపాదిగా పబ్ లోకి వెళ్లి బీర్ సేవిస్తూ సేదదీరాడు. పబ్ ముందు దిగే క్రమంలో తన తలపై విమానం దూసుకెళ్లిందని సదరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి భయంభయంగా చెప్పాడు. పార్క్ ముందు విమానం నిలిపి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇదేమంత తేలిక విషయం కాదని పేర్కొన్న పోలీసులు, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News