: ఆ అమ్మాయి చివరి కోరిక తీర్చిన శృతి


తమ అభిమానుల చివరి కోరిక తీర్చేందుకు సినీ నటులు ఏ మాత్రం వెనుకాడటంలేదు. ప్రాణాలతో పోరాడుతూ మరికొన్ని రోజుల్లో చనిపోయేవారిని కలసి వారిలో ఆనందం నింపుతున్నారు. తాజాగా నటి శృతి హసన్ కూడా క్యాన్సర్ తో పోరాడుతున్న పూణెకు చెందిన సీతల్ పవార్ (17) అనే అభిమానిని కలిసింది. ఆమెతో చాలాసేపు ముచ్చటించి సంతోష పరిచింది. తన సినిమాల గురించి బాలికకు తెలిపింది. వెళ్లేముందు మరణంతో పోరాడుతున్న సీతల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ శృతి ఓ లేఖ రాసిచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆ అమ్మాయి ఇక జీవించదని అసుపత్రి వైద్యులు చెప్పారు. ఆమె చివరి కోరిక ఏదైనా ఉంటే తీర్చండన్నారు. అప్పుడే తమ కుమార్తె సీతల్ హీరోయిన్ శృతి హసన్ ను దగ్గరగా చూడాలనుకుంటోందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ వారు తెలుసుకుని శృతికి తెలియజేశారు. దీనికి చలించిన శృతి ముంబయిలోని ఓ సినిమా షూటింగు నుంచి వెంటనే పూణె వెళ్లి ఆ బాలిక కోరిక తీర్చింది.

  • Loading...

More Telugu News