: విశాఖలో కాసినోలు స్థాపిస్తామంటూ ఏపీ సర్కారుకు దరఖాస్తులు
భారత్ లో కాసినో కల్చర్ బాగా వేళ్లూనుకుని ఉన్న నగరాల్లో గోవా ప్రథమస్థానంలో ఉంటుంది. అక్కడ 20కి పైగా కాసినోలు ఉన్నాయి. వాటిపై పన్నుల రూపేణా గోవా సర్కారు ఏటా సుమారు రూ.100 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇప్పుడు గోవా కాసినో యజమానుల దృష్టి ఏపీ పారిశ్రామిక రాజధాని అనదగ్గ విశాఖపట్నంపై పడింది. తాము విశాఖలో కాసినోలు స్థాపిస్తామని వారు ఏపీ సర్కారుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన జూదప్రియులు గోవా కాసినోల్లో నెలకు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. గోవా, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం డామన్ లో మాత్రమే కాసినోల ఏర్పాటుకు అనుమతి ఉంది.