: భారత్ లో 7 కోట్లు దాటిన వాట్సప్ వినియోగదారులు
మొబైల్ మెసెంజర్ సర్వీస్ ‘వాట్సప్’ను వినియోగిస్తున్న భారతీయుల సంఖ్య 7 కోట్లు దాటేసింది. తత్ఫలితంగా వాట్సప్ ను వినియోగిస్తున్న వారిలో పదో వంతు కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీంతో తమకు భారత్ కీలక మార్కెట్ గా అవతరించిందని వాట్సప్ బిజినెస్ హెడ్ నీరజ్ అరోరా సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం వాట్సప్ ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వినియోగిస్తున్నారని ఆయన వెల్లడించారు. మరింత మంది భారతీయులకు చేరువయ్యేందుకు కృషి చేయనున్నట్లు అరోరా ప్రకటించారు.