: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తొలి సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం దివంగత ఎన్టీఆర్ కుమారుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, చంద్రబాబు తనయుడు లోకేశ్ తదితరులు కూడా పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ సోమవారమే సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగనుంది.