: విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జూడాల సమ్మె


తెలంగాణ జూడాలతో ప్రారంభమైన సమ్మె ప్రస్తుతం ఏపీకి పాకింది. ఈ రోజు విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జూడాలు సమ్మెకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వారు నిరసన తెలుపుతున్నారు. ఏడాది పాటు తాము గ్రామీణ ప్రాంతాల్లో చేసే సర్వీసును పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడానికి తాము సిద్ధమని... అయితే, తమ సేవలు తాత్కాలికంగా కాక పర్మినెంట్ గా ఉండాలని నినదిస్తున్నారు. ఈ రోజు తొలి రోజు కావడంతో నిరసన మాత్రమే తెలుపుతున్నామని... రేపటి నుంచి సమ్మెను ఉద్ధృతం చేస్తామని జూడాలు హెచ్చరించారు. చర్చల కోసం కాలేజి వైస్ ప్రిన్సిపల్ ఆహ్వానించినప్పటికీ... జూడాలు తిరస్కరించారు. తెలంగాణ జూడాలతో పాటే ఏపీ జూడాలు కూడా ఇంతకు ముందే సమ్మె చేయాల్సి ఉంది. అయితే, హుదూద్ తుపాను ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన నేపథ్యంలో... అప్పట్లో సమ్మె చేయరాదని వారు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News