: గచ్చిబౌలిలో ఉద్రిక్తతలకు దారితీసిన రోడ్డు వెడల్పు కార్యక్రమం... పోలీసుల మోహరింపు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేయడానికి జీహెచ్ ఎంసీ అధికారులు ఉపక్రమించగా... స్థానికులు వారిని అడ్డుకున్నారు. రోడ్డు వెడల్పుతో తాము విలువైన ఆస్తులను కోల్పోతామంటూ కొందరు, జీవనోపాధిని కోల్పోతామంటూ మరికొందరు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కూల్చివేతలకు దిగిన ప్రొక్లెయినర్లను అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం గచ్చిబౌలి ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఖాకీల సమక్షంలోనే కూల్చివేతలను కొనసాగిస్తున్నారు అధికారులు.