: ప్రముఖ రైతు సంఘ నాయకుడు జంపని కన్నుమూత


ప్రముఖ రైతు సంఘ నాయకుడు డాక్టర్ జంపని వెంకటరాయుడు (82) కన్నుమూశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తొలి తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన... రైతుల శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించారు. కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా కూడా జంపని వెంకటరాయుడు సేవలందించారు. వెంకటరాయుడి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News