: షబ్బీర్ అలీకి ఉగ్రవాద లింకులున్నాయన్న బీజేపీ నేత


మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు విరుచుకుపడ్డారు. షబ్బీర్ కు ఉగ్రవాదులతో లింకులున్నాయని ఆరోపించారు. మతకలహాలకు పలుమార్లు షబ్బీర్ కారకులయ్యారని విమర్శించారు. సర్దార్ పటేల్ గురించి మాట్లాడే ప్రధాని మోదీ... పటేల్ కోరుకున్నట్టు ఆర్ఎస్ఎస్ ను నిషేధిస్తారా? అని షబ్బీర్ ప్రశ్నించడంపై స్పందించిన కాసం పైవిధంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే అర్హత షబ్బీర్ కు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News