: అనాథ బాలల మధ్య టెన్నిస్ స్టార్ సానియా
భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఆదివారం అనాథ చిన్నారుల మధ్య గడిపింది. సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ కు చెందిన ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన సానియా, అక్కడి చిన్నారులతో ఉల్లాసంగా గడిపింది. ‘మేక్ ఏ డిఫరెన్స్’ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అనాథాశ్రమానికి వెళ్లిన సానియా అక్కడి బాలబాలికల్లో ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలపై పిల్లలతో ముచ్చటించింది.