: నేడు ఏపీలో జూడాల సమ్మె ప్రారంభం


తెలంగాణలో కొనసాగుతున్న జూనియర్ వైద్యుల సమ్మె ముగియనేలేదు, ఏపీలోనూ జూనియర్ వైద్యులు సమ్మె బాట పట్టారు. నేడు ఏపీలో జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి, సమ్మెకు దిగుతున్నారు. రూరల్ సర్వీసులకు సంబంధించి నెలకొన్న వివాదంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే దాకా సమ్మె విరమించేది లేదని ఈ సందర్భంగా ఏపీ జూడాలు తేల్చి చెప్పారు. న్యాయమైన తమ సమ్మెకు ప్రజా సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జూడాల సమ్మెతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడగా, తాజాగా ఏపీలోనూ జూడాల సమ్మెతో సర్కారీ వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి.

  • Loading...

More Telugu News