: అమెరికా ఎన్నికల బరిలోకి దిగుతున్న 30 మంది ఎన్నారైలు
అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే జరగనున్న అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో ఏకంగా 30 మంది ఎన్నారైలు బరిలోకి దిగుతున్నారు. మొత్తం 435 సీట్లున్న సభలో సత్తా చాటేందుకు ఎన్నారైలు ఉవ్విళ్లూరుతున్నారు. అమిరేశ్ అమీబేరా, మనన్న్ త్రివేది, అర్విన్ వోహ్రా, నిక్కీ హాలే, నీల్ ఖశ్కేరీ, కమలా హారిస్ లతో పాటు పలువురు ఎన్నారైలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.