: తొలి వన్డేలో శ్రీలంక చిత్తు... భారీ స్కోరుతో టీమిండియా విజయం!


కటక్ లోని బారాబతి స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేను టీమిండియా సునాయాసంగా గెలుచుకుంది. 169 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (113), రహానే (111) సెంచరీలతో రాణించి, లంక ముందు భారీ లక్ష్యాన్ని నిలిపారు. అనంతరం బ్యాటింగుకు దిగిన లంక 39.2 ఓవర్లకే 194 పరుగులు చేసి కుప్పకూలింది. మధ్యలో లంక స్టార్ ప్లేయర్ జయవర్ధనే ఒంటరి పోరు సాగించినా, జట్టును ఆదుకోలేకపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రహానే ఎంపికయ్యాడు.

  • Loading...

More Telugu News