: ఓటమి అంచున శ్రీలంక
కటక్ వన్డేలో శ్రీలంక జట్టు ఓటమి అంచున నిలబడింది. 364 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 35 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. జయవర్ధనె (43), తరంగ (28), మాథ్యూస్ (23), దిల్షాన్ (18), సంగక్కర (13), ప్రియాంజన్ (12), ప్రసన్న(5), రణదీవ్ (5) విఫలమయ్యారు. దీంతో టీమిండియా భారీ విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. పెరీరాకు జతగా దమ్మిక ప్రసాద్ బరిలో దిగాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (3), అక్షర్ పటేల్ (2)కు ఉమేష్ (1), అశ్విన్ (1) చక్కని సహకారమందించారు.