: వాఘా సరిహద్దు వద్ద భారీ పేలుడు
పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. లాహోర్ శివారుల్లోని వాఘా సరిహద్దు వద్ద ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి 45 మంది మృత్యువాత పడగా, 70 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ పేలుడు తీవ్రతకు భవనాలు బీటలు వారగా, పలు భవనాల కిటికీలు బద్దలయ్యాయి. పలు భవనాలు, దుకాణ సముదాయాలు ధ్వంసమయ్యాయి. పాక్ పోలీసులు దీనిని ఆత్మాహుతి దాడిగా భావిస్తుండగా, దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను లాహోర్ లోని ఆసుపత్రికి తరలించారు.