: హంతకులను పట్టుకోండి: ఫడణవీస్ ను కోరిన రాజ్ ఠాక్రే


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ను మాహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కలిశారు. అహ్మద్ నగర్ జిల్లా పతార్డి తాలుకాలోని జవఖేదా గ్రామంలో గత నెల 21న జరిగిన ముగ్గురు దళితుల హత్యపై లోతైన దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. హంతకులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, హంతకులను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఫడణవీస్ హామీ ఇచ్చారని ఠాక్రే తెలిపారు. అనంతరం సీఎం, హత్యకు గల కారణాలు త్వరితగతిన వెలికి తీయాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News