: ఆ బ్యాంకుల్లోనే నల్లధనం మూలుగుతున్నట్టుంది!


నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు అవకాశమున్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో సెబీ మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది. నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి మళ్లీ తరలిస్తున్నారని సెబీ గుర్తించింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించింది. రెండు స్విస్ బ్యాంకులు, ఒక యూరప్ బ్యాంక్ పై సెబీ ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తోంది. 15-20 భారతీయ కంపెనీలపై తమకు అనుమానముందని సెబీలో ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. బ్లాక్ మనీ దర్యాప్తు కేసుతో స్విస్ బ్యాంకుల్లో ఆందోళన నెలకొంది. నల్లధనానికి సంబంధించి భారత్ తో ఒప్పందం చేసుకోవాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సెబీ విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News