: రాణించిన ధావన్, రహానే, రైనా... టీమిండియా స్కోరు 363
ఆటగాళ్లు వీరవిహారం చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. టీమిండియా ఓపెనర్ల ద్వయం సెంచరీలతో చెలరేగిపోయి, టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేశారు. ఫాం అందిపుచ్చుకున్న ధావన్, రహేనే నిలదొక్కుకోవడంతో కేవలం 34వ ఓవర్ కే టీమిండియా రెండు వందల స్కోరు దాటిపోయింది. ధావన్, రహానే షాట్లకు శ్రీలంక బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ధావన్ (113), రహానే (111) అవుటైనప్పటికీ రైనా (52) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం కోహ్లీ (22), రాయుడు (27) జోరు పెంచే క్రమంలో అవుటయ్యారు. వృద్ధిమాన్ సాహా(10) కు జోడుగా చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన స్పిన్ సంచలనం అక్షర్ పటేల్ కేవలం నాలుగు బంతుల్లో 14 పరుగులు చేసి సత్తాచాటాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 363 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లలో రణదీవ్ రాణించగా, అతనికి ప్రియాంజన్, గేమేజ్ సహకారమందించారు.