: కేసీఆర్ గారడీ చేస్తున్నారు: జానారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతు రుణమాఫీపై స్పష్టత లేదని అన్నారు. మావోయిస్టు ఎజెండా అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వంపై మావోయిస్టులు కూడా మండిపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర అంశాలను పార్టీకి వదిలేసి, పాలనపై కేసీఆర్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.