: ఏనుగు లాంటి విమానాన్ని ఎలుక ఆపేసింది!
ఏనుగులాంటి విమానాన్ని బుల్లి ఎలుక ఆపేసింది. నార్వే ఎయిర్లైన్స్ కు చెందిన విమానం, న్యూయార్క్ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కాక్ పిట్ లో ఓ ఎలుక దూరినట్టు సిబ్బంది గమనించారు. దాని వెంటపడి ఎలాగోలా పట్టుకున్నారు. అయితే దూరింది ఒక్కటేనా? లేక ఇంకా ఏమైనా ఎలుకలు మిగిలిపోయాయా? అన్న డౌటుతో శోధన ప్రారంభించారు. ఈ శోధన కారణంగా విమానం ఐదు గంటల పాటు నిలిచిపోయింది. విమానం గాల్లోకి ఎగిరిన తరువాత ఎలుకలు విమానం లోపలి వైర్లను కొరికేస్తాయనే భయంతోనే వాటిని పట్టుకున్నామని సిబ్బంది తెలిపారు.