: సేవ చేయడానికి సిద్ధమే... గ్రామీణ ప్రాంతాలకు పంపడం సరికాదు: జూడాలు


నెల రోజులుగా సమ్మె చేస్తున్న హైదరాబాదులోని జూనియర్ డాక్టర్లు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన జూనియర్ డాక్టర్లు, తమను గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు పంపే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులను బలోపేతం చేయకుండా సరైన వైద్య సేవలు ఎలా అందుతాయని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామని జూడాలు తెలిపారు.

  • Loading...

More Telugu News