: కల్లు వద్దని కదం తొక్కిన మహిళలు... అడ్డుకున్న పోలీసులు


హైదరాబాదులో కల్లు కాంపౌండ్లు వద్దంటూ మహిళలు కదంతొక్కారు. వెంగళరావు నగర్లో కల్లు కాంపౌండ్ ప్రారంభించిన కాసేపటికే దానిపై దాడి చేశారు. తమ బస్తీలో కల్లు కాంపౌండ్ లు వద్దని ఆందోళనకు దిగారు. మళ్లీ కల్లు కాంపౌండ్ లు తెరచి తమ జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహించారు. తమ భర్తలు, పిల్లలు కల్తీ కల్లుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కల్లు సీసాలను ధ్వంసం చేశారు. తమ ప్రాంత పరిథిలో ఉన్న మూడు కల్లు దుకాణాలను తక్షణం మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళనకు దిగారన్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత అక్కడ నెలకొంది.

  • Loading...

More Telugu News