: కేసీఆర్ ఛత్తీస్ గఢ్ వెళ్లారు


తెలంగాణలోని విద్యుత్ సమస్యను రూపుమాపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాయ్ పూర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పలువురు ఉన్నతాధికారులు వెళ్లారు. తమ మిగులు విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేయాలని వారు ఆ రాష్ట్రాన్ని కోరనున్నారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను చేసుకుంటారు.

  • Loading...

More Telugu News