: ఏడు మండలాలు వెళ్లిపోతే నోరెత్తలేదేం: కేసీఆర్ కు టీకాంగ్ నేతల ప్రశ్న
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలిసిపోయిన సందర్భంగా ఎందుకు నోరెత్తలేదని టీకాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఆదివారం పార్టీ నేతలు రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు పార్లమెంట్ లో టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనం పాటించారో చెప్పాలని కూడా ఆయన కేసీఆర్ ను నిలదీశారు. రాజకీయ ఫిరాయింపులను కాంగ్రెస్ ఏనాడూ ప్రోత్సహించలేదన్నారు. అసలు ఐదు నెలల పాలనలో కేసీఆర్ చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా అని పొన్నం ప్రశ్నించారు. ప్రజా సమస్యలు విస్మరించిన కేసీఆర్ స్వార్థ రాజకీయాలే ఎజెండాగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు.