: '24/లవ్' సినిమా దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
సినీ తారలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. తాజాగా ఓ సినీ దర్శకుడిపై ఆ సినిమా హీరోయిన్ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. '24/లవ్' దర్శకుడు విఎస్ ఫణి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ సినిమా హీరోయిన్ సోనాలి ఆరోపిస్తూ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఫణి తొలి ప్రయత్నంగా '24/లవ్' (వర్మకైనా, ఒబామాకైనా అనేది ఉపశీర్షిక) సినిమాకి దర్శకత్వం వహించారు.