: నరేంద్ర మోదీ మాటల మాంత్రికుడు!: అరవింద్ కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు విమర్శలు గుప్పించారు. మోదీ గొప్ప వక్త అని, అయితే మోదీ మాటలకే పరిమితమవుతారని కేజ్రీవాల్ అన్నారు. మాటలతో మంత్రం వేసే మోదీ, ఆచరణలో మాత్రం మందకొడిగా వ్యవహరిస్తారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారా? లేదా? అన్న విషయాన్ని పక్కనబెడితే, ఐదు నెలల పాలనతో దేశంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో మాత్రం మోదీ కృతకృత్యులయ్యారన్నారు. ‘మోదీ గొప్ప వక్త. మంచి విషయాలు మాట్లాడతారు. అయితే ఆచరణ మాత్రం నెమ్మదిగా ఉంటోంది. భవిష్యత్ లో ఆయన ఏం చేస్తారో చూద్దాం’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.