: చంద్రబాబు రాక్షస పాలన సాగిస్తున్నారు: వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ


విపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని స్థాపించాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు యత్నాన్ని తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఈ సందర్భంగా నెహ్రూ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు భూమా, చెవిరెడ్డి, రోజాలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాన్ని నిర్మూలించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. దైవకార్యంలో పాల్గొనేందుకు వెళ్లిన రోజాపై కేసు పెట్టడమే చంద్రబాబు దుర్నీతికి నిదర్శనమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News