: జూడాల సమ్మెకు మద్దతివ్వబోం: చుక్కా రామయ్య


డిమాండ్ల పేరిట నెలల తరబడి జూడాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతివ్వబోమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. జూడాల సమ్మె కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన ఆదివారం చెప్పారు. ఈ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జూడాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వం కూడా జూడాల డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అయితే సామాన్య ప్రజల పక్షాన నిలిచే తాము నెలల తరబడి సాగుతున్న జూడాల సమ్మెకు మద్దతివ్వబోమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News