: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎవ్వరూ ఆపలేరు: కేసీఆర్
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎవ్వరూ ఆపలేరని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం మల్కాజిగిరిలో నీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన మరోమారు చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. తెలంగాణలో పంటలను ఎండగట్టేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు పప్పులు ఉడకనివ్వమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.