: తిరుమలలో మొరాయించిన కంప్యూటర్లు: ఇబ్బందుల్లో భక్తులు
శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో ఆదివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో ప్రత్యేక దర్శన టికెట్ల జారీ, గదుల కేటాయింపులో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మరో రెండు గంటలు గడిస్తే గాని సాంకేతిక లోపం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం సెలవు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. సరిగ్గా అదే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.