: మహారాష్ట్రను గుజరాత్ కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తా: ఫడ్నవీస్
రాష్ట్రాన్ని అభివృద్ధిలో గుజరాత్ ను తలదన్నే రీతిలో పరుగులు పెట్టిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ రకమైన వృద్ధి మహారాష్ట్రలో నమోదైతే ప్రధాని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కూడా సంతోషిస్తారని కూడా ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్, ఆ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో రెండో వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.