: సాగర్ లో విద్యుదుత్పత్తి పున:ప్రారంభం
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఆదివారం తిరిగి ప్రారంభమైంది. ప్రాజెక్టులో మొత్తం 8 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం ఏడు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సాగర్ కు వరద నీటి ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఇటీవల నిలిపేసిన విద్యుదుత్పత్తిని అధికారులు తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 43,200 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది.