: రబీకి కరెంటివ్వలేం... వరి సాగుకు దిగకండి: కేసీఆర్
రబీ సీజన్ లో సాగుకు కరెంటివ్వలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. విద్యుత్ కొరత నేపథ్యంలోనే ఈ పరిస్థితి దాపురించిందని, రైతులు కూడా వాస్తవ స్థితిగతులను అవగాహన చేసుకుని ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగుకు దిగరాదని ఆయన కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కుట్ర కారణంగానే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొందని ఆయన ఆరోపించారు. రెండు, మూడేళ్లలో పరిస్థితిని చక్కదిద్దుతామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.