: నేడు ఛత్తీస్ గఢ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు ఛత్తీస్ గడ్ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో అత్యంత దుర్భరంగా మారిన విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎట్టకేలకు కేసీఆర్ తొలి అడుగేసినట్టైంది. తన పర్యటనలో భాగంగా ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరితే, నేడు ఒప్పందాలు కూడా జరిగిే అవకాశాలున్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాక, రెండు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత విద్యుత్ లైను ఏర్పాటు అంశంపై కూడా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News