: నేటి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, తొలి సభ్యత్వం తీసుకుని ప్రారంభిస్తారు. 2015 మార్చి 31 దాకా కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతమున్న సభ్యత్వాలను నాలుగింతలు చేసుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఈ కార్యక్రమం ద్వారా అన్ని రికార్డులను బద్దలు కొట్టాలనుకుంటున్నాం. ఈ దఫా జారీ చేస్తున్న సభ్యత్వం ఆరేళ్ల దాకా చెల్లుబాటవుతుంది’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నద్దా తెలిపారు. ‘సభ్యత్వ నమోదులో పాత చింతకాయ పచ్చడి మాదిరి ఫారాలను నింపడంతో పాటు సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నాం. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు కూడా శ్రీకారం చుడుతున్నాం. మోదీ తొలి సభ్యత్వం తీసుకుంటుండగా, అమిత్ షాకు రెండో సభ్యత్వం ఇవ్వనున్నాం’ అని నద్దా చెప్పారు.