: లిమ్కా బుక్ రికార్డులకెక్కిన కేకు
దేశంలోని అతిపెద్ద కేకును కేరళలోని కోజికోడ్ లో తయారు చేశారు. 600 అడుగుల పొడవు, 3,120 కేజీల బరువు గల భారీ కేకును బేక్ ఎక్స్ పోలో భాగంగా కేరళ బేకర్స్ అసోసియేషన్ తయారు చేసింది. ఈ కేకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల క్రియేటివ్ హెడ్ పి.పి.పీటర్ ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందజేశారు.