: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రిటన్ వాసులూ జాగ్రత్త!: బ్రిటన్ విదేశాంగ శాఖ


విదేశాల్లో స్ధిరపడిన, విదేశాలకు వెళ్తున్న బ్రిటన్ పౌరుల్ని ఆ దేశం హెచ్చరించింది. ఇరాక్ లో బ్రిటన్ జరిపిన వైమానిక దాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకోవచ్చని, అందుకని బ్రిటన్ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్ అభ్యర్థన మేరకు, బ్రిటన్ పార్లమెంటు ఆమోదంతో ఆ దేశ వైమానిక దళం సెప్టెంబర్ లో దాడులు చేసింది. బ్రిటన్ తో నేరుగా పోరాడే అవకాశం లేని ఐఎస్ఐఎస్ ఆ దేశ పౌరులను కిడ్నాప్ చేసి హత్య చేసే ప్రమాదముందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News