: ఈవ్ టీజింగ్ అరికట్టేందుకే 'షి' బృందాలను ఏర్పాటు చేశాం: స్వాతిలక్రా
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు 'షి' బృందాలను ఏర్పాటు చేశామని అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రాజధానిలో ఈవ్ టీజింగ్ అరికడతామని అన్నారు. మహిళలను వేధిస్తున్న వారి ఆటకట్టించేందుకు 100 'షి' బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత నెల 24 నుంచి ఇప్పటి వరకు 40 మందిని ఆరెస్టు చేశామని వివరించారు. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లోనే 'షి' బృందాలు ఉన్నాయని తెలిపిన ఆమె, త్వరలో కళాశాలల్లో అడుగుపెడతాయని తెలిపారు. కళాశాల విద్యార్థుల్లో చైతన్యం తెస్తామని, మహిళలను వేధించే వారిని ఆధారాలతో ఆరెస్టు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.