: భూమా వ్యాఖ్యల వల్లే టీడీపీ నేతలపై హత్యాయత్నం జరిగింది: కర్నూలు ఎస్పీ
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే టీడీపీ నేతలపై హత్యాయత్నం జరిగిందని కర్నూలు ఎస్పీ రవికృష్ణ స్పష్టం చేశారు. పలువురు టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో భూమా సమక్షంలోనే టీడీపీ కౌన్సిలర్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, భూమా నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.