: విజయవాడలో దారుణం... మత్తు మందిచ్చి కూతురిపై అత్యాచారం
మహిళలకు సొంత ఇంట్లోనే రక్షణ లేకుండా పోయింది. విజయవాడలోని వాంబే కాలనీలో సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే దారుణం చోటుచేసుకుంది. చేయిపట్టి నడిపి ప్రపంచాన్ని చూపించిన తండ్రే ఆమె పాలిట కీచకుడయ్యాడు. అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ అప్పారావు (42)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె (17) పదో తరగతి వరకు చదివి ఆపేసింది. స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. బలం కోసమని చెప్పి భార్య, కుమార్తెకు మత్తు మందులు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ మత్తులోకి జారుకున్నాక కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈమధ్యనే అనుమానం వచ్చిన భార్య అప్పారావును నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది... దీంతో తల్లీకూతుళ్లు 'నున్న' పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో ఏడాదిగా ఈ దారుణం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి చెందారు.