: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల పునర్విచారణకు డిమాండ్


ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1984లో సిక్కులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. ఈ క్రమంలో దాదాపు మూడువేల మందికి పైగా అమాయకులు మరణించారు. ఆ నరమేధానికి సంబంధించి పలు కేసులు నమోదవగా, కొంతమందికి శిక్షలు పడ్డాయి. అయితే, నాటి కేసుల ఫైళ్లను దుమ్ముదులిపి పునర్విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా' అనే సంస్థ ఢిల్లీ, బెంగళూరులో ఓ ఆన్ లైన్ ప్రచారం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చాలామంది నాటి మారణహోమం బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 'అమ్నెస్టీ' డైరెక్టర్ శైలేష్ రాయ్ మాట్లాడుతూ, "చాలా సిగ్గుపడే ఘటనలు జరిగి ఈ ఏడాదితో 30 సంవత్సరాలు అయింది. ఇది జాతికి చాలా అవమానకరం. 1984 హింసాకాండ బాధితులకు గత మూడు దశాబ్దాలుగా న్యాయం దక్కడం లేదు" అని చెప్పారు.

  • Loading...

More Telugu News