: 'ఇస్కాన్' భక్తురాలిని లైంగికంగా వేధిస్తున్న సాధువు


లైంగిక వేధింపులు ప్రతి చోటా ఉన్నాయని నిరూపించే ఘటన బృందావన్ లో చోటు చేసుకుంది. ఇటలీకి చెందిన 65 ఏళ్ల బ్రిజ్ బాసి దేవి అనే 'ఇస్కాన్' భక్తురాలు గత 40 ఏళ్లుగా బృందావన్ లో ఉంటోంది. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో నితాయీ దాస్ అనే సాధువుపై ఫిర్యాదు చేశారు. దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, యాసిడ్తో దాడి చేస్తానని కూడా బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News